ఇక్కడో తమాషా లెక్క ఇస్తున్నాము.
సమాధానం తెలిస్తే మాకు పోస్ట్ చేయండి.
ఒక తండ్రి తన ముగ్గురు కొడుకుల తెలివి తేటల్ని పరీక్షించాలనుకొని దగ్గిరికి పిలిచి "నాయనలారా, నేను మీకు కొన్ని మామిడి కాయాల్ని ఇస్తున్నాను. అవి మీరు ఎక్కడైనా అమ్మి డబ్బు తీసుకురావాలి" అంటూ పెద్ద కొడుక్కి 10 కాయలు, రెండో వాడికి 30 కాయలు, మూడో వాడికి 50 కాయాలు ఇచ్చాడు. అయితే ఒక షరతు పెట్టడు. ముగ్గురూ విడివిడిగా వేర్వేరు చోట్లకి పోయి తమ దగ్గరున్న కాయలన్నీ ఒకే ఖరీదుకి అమ్మాలి. కానీ ముగ్గురూ సమానమైన డబ్బు తీసుకు రావాలి.
ముగ్గురూ కొడుకులూ చాల తెలివైన వాళ్ళు కాబట్టి తమకి కాయలు సమానంగా ఇవ్వకపోయినప్పటికీ, ఆ కాయల్ని ఒకే రేటుకి అమ్మి సమానంగా డబ్బు తీసుకు వచ్చారు. ఎలా తీసుకు రాగలిగారో వివరంగా మీరు చెప్పాలి. (ఇందులో తికమక ఏమీ లేదు. నూటికి నూరు పాళ్ళూ ఇది గణితపరమైన సమస్య. మీ సమాధానాన్ని సబ్మిట్ యువర్ పోస్ట్ బటన్ (home page) నొక్కి పంపవచ్చు)
If you face any problem in reading the above text in Telugu, please write to us using "Contact Us" form (home page)